టాలీవుడ్లో రూమర్స్ ఎక్కువైపోతున్నాయి.అస్సలు సెట్ కావనుకున్న కాంబోలు మళ్లీ ఒక్కటౌతున్నాయి.
దీనిలో భాగంగా బాలయ్యబాబు,బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య-బిగోపాల్ కాంబోలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.అప్పట్లో వీరిద్దరు సూపర్ కాంబో.పల్నాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ తర్వాత వీరి మధ్య గ్యాప్ వచ్చింది.
17ఏళ్ల నుంచి వీరి కాంబోలో సినిమా వచ్చింది లేదు.అలాంటిది మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా అనే రూమర్ ఆడియన్స్ లో మాసివ్ హిట్ వస్తుందనే కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా బాలయ్య కోసం ఆకుల శివ రాసిన కథకు… బుర్రాసాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నాడు.ఇందుల్లో బాలయ్య “స్పై” క్యారెక్టర్ పోషించబోతున్నాడు.బాలయ్య శైలిలోనే సినిమా సాగుతూ కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందనే టాక్ బలంగానే వినిపిస్తుంది. ఇప్పటికే పైసా వసూల్ సినిమాలోను నటసింహ “స్పైగా” కనిపించాడు.
బాలయ్య ,బి గోపాల్ ప్రాజెక్ట్ ఆ మధ్యనే అనుకున్నారు.ఐతే లాస్ట్ మినిట్లో ఇది క్యాన్సల్ అయింది.ఐతే ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి రావడంతో సినిమాపై పరిశ్రమలో చర్చ నడుస్తుంది.బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ లు నిలిచిన ‘సమరసింహారెడ్డి,నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. అందుకే ‘బాలయ్య – బి గోపాల్’ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో అంతటి ఆసక్తి నెలకొని ఉంది.