పవన్ కళ్యాణ్ లోని ఆవేశాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసే సత్తా..డ్యాషింగ్ డైరెక్టర్ పూరికి మాత్రమే ఉందని అందరికీ తెలుసు.అయితే చాలాకాలంగా కొన్ని రీజన్స్ తో వీరిద్దరి ప్రాజెక్ట్ లేటువుతూ వస్తుంది.ఐతే రీసెంట్ గా జరిగిన స్టోరీ సిట్టింగ్ తో వీరి కాంబోలో మూడో ప్రాజక్ట్ సెట్ అయినట్లు టాక్ అయితే నడుస్తుంది.దీనిపై ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
పవన్ లోని హీరోయిజాన్ని కరెక్ట్ గా ప్రజంట్ చేసిన దర్శకులలో పూరి ప్రధానంగా కనిపిస్తారు.నిజానికి బద్రి,కెమేరా మెన్ గంగతో రాంబాబు తర్వాత వీరి కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు.చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ను ఒకవేల పూరి డైరెక్ట్ చేస్తే ఆ తర్వాత పవన్ తోనే సినిమా అన్నారు.కాని అలా జరగలేదు. దీంతో పవన్ తో సినిమాకు పూరి చాలాకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.
రీసెంట్ గా పవన్ కోసం పూరి ఓ కథను సిద్దం చేశాడు.పవన్ ఆలోచనలకు తగ్గట్లుగా ఈ కథ తయారైందని తెలుస్తుంది.ఐతే ఈ ప్రాజెక్ట్ రెండేళ్ల తరువాత ఉంటుంది.భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో స్టోరీ రన్ అవుతుందట.అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం ఏంటో చూపెడుతుందని చెబుతున్నారు.కెమేరా మెన్ గంగతో రాంబాబులోను ఇదే తరహా సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
తాజాగా వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే… గతంలో మహేష్ కోసం సిద్ధం చేసిన జనగనమణ స్క్రిప్ట్ ను ఇప్పుడు పవన్ కు వినిపించారని ఇది ఇప్పటికిప్పుడు తయారుచేయలేదనే రూమర్ ఒకటి… రౌండ్లు కొడుతుంది. అది కూడా నిజమే అవ్వొచ్చు.వచ్చే ఏడాది ఎండింగ్ కు చేతిలో ఉన్న సినిమాలన్నీ పవన్ పూర్తి చేసే ఛాన్స్ ఉంది.అలాగే రానున్న కాలంలో పొలిటికల్ టై అప్ లతో చూసినప్పుడు జనగణమణ పవన్ కు కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమానే.ఈ ఫిలింతో పవన్ కు పొలిటికల్ గాను వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.