ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఈ కార్యక్రమం రెండో సీజన్లో భాగంగా అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రారంభంకానున్న.. మొదటి ఎపిసోడ్ ప్రోమో విడదల ఆకట్టుకుంటోంది. ఇందులో బాలకృష్ణ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సమాధానమిచ్చారు.
చంద్రబాబును బాలకృష్ణ అద్భుత ఇంట్రడక్షన్ ఇచ్చి షోలోకి ఆహ్వానించారు. బాలకృష్ణ తన ఎనర్జీతో ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ఈ సందర్భంగా ‘మొదటి ఎపిసోడ్‌కు నా బంధువును పిలుద్దామనుకున్నా.. కానీ అందరి బంధువు అయితే బాగుంటుందని.. మీకు బాబు.. నాకు బావ.. చంద్రబాబు నాయుడును ఆహ్వానించా. భారతదేశంలోని దిగ్గజ రాజకీయ నాయకులలో ఒకరైన చంద్రబాబుకు స్వాగతం’ అంటూ బాలకృష్ణ ఆహ్వానం పలికారు.
అయితే ఈ షోలో తన రెండో ఫ్యామిలీ గురించి బాలకృష్ణ బయటపెట్టేశారు. అందులో మొదటిది భార్య వసుంధర, పిల్లలు అని.. రెండోది క్రిత సంవత్సరం స్టార్ట్ అయిందని.. దాంతో డీప్‌గా కనెక్ట్ అయిపోయా అని అన్‌స్టాపబుల్‌ను ఉద్దేశించి అన్నారు బాలయ్య. దానికి బాబు స్పందిస్తూ.. ‘ఈ బ్రేకింగ్ న్యూస్ వెంటనే వసుంధరకి చెప్పాలి’ అంటూ చమత్కరించారు. ఇక దీంతో నవ్వడం బాలయ్య వంతయ్యింది. ప్రోమో మొత్తం ఇలాంటి పంచులతోనే సాగింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఎపిసోడ్ అక్టోబర్ 14 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.