బాలయ్య, చిరంజీవి సినిమాలకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

-

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేర్ వీరయ్య సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. అయితే ఇందులో వీరసింహారెడ్డి సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కాబోతూ ఉండగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన ఒంగోలులో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించినట్లు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒంగోలులో జరగవలసిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు హైదరాబాదుకి మార్చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానులు చాలా తీవ్రమైన నిరాశకు గురవుతున్నట్లుగా సమాచారం. ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక రోడ్డు షోలో కొంతమంది తొక్కిసలాటలో మరణించారు. ఇక అప్పటినుంచి రోడ్డు షోను నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ ను ఒంగోలులో జరగడం వల్ల అక్కడికి అత్యధికంగా జనాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని దీనివల్ల తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉందని గుర్తించిన పోలీస్ అధికారులు వెంటనే ఈవెంట్ ని కూడా అనుమతి ఇవ్వలేదన్నట్లుగా సమాచారం.

ఇక చిరంజీవి సినిమాకి కూడా జనవరి 8వ తేదీన వైజాగ్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ కాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినిమా విడుదలకు ముందే చిరంజీవి, బాలయ్యలకు ఇదొక గట్టి షాక్ తగిలిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయాన్ని చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news