తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది – బాలకృష్ణ

-

తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరిందని నందమూరి బాలకృష్ణ ఎమోషనల్‌ అయ్యారు. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయం కృషి తో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ..తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి అని తెలిపారు.

వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది..సూపర్ స్టార్ కృష్ణగారి మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. టాలీవుడ్ జేమ్స్ బాండ్, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరని లోటు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‍బాబుకు ఇది తీరని వేదన అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృష్ణగారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు నందమూరి బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news