ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ బోర్లకు మీటర్లు అమర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చామని ఆయన అన్నారు. కేంద్ర మిచ్చే 4 వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తాం తప్ప అవి మా జేబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండటం మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్ర అభివృద్ధికోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని భావించామని ఆయన అన్నారు. అదే పరిస్థితిలో రైతులకు అందించే ఉచిత విద్యుత్ విషయంలో రాజీపడమన్న మంత్రి మరో 30సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పమని రైతులకు హామీ ఇస్తున్నామని అన్నారు. డిస్కంలకు చెల్లించ వలసిన బిల్లును నేరుగా రైతుల అకౌంట్లలో ముందుగానే జమ చేస్తున్నామని దీనిపై ఎవ్వరూ అనుమాన పడవలసిన అవసరంలేదని అన్నారు.