వచ్చే ఎన్నికల్లో జగన్‌ నాకు టికెట్‌ ఇవ్వకపోవచ్చు – మాజీ మంత్రి బాలినేని

-

బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు కాకుండా తన భార్య సచీదేవికి టికెట్ ఇస్తారేమోనని కామెంట్ చేశారాయన. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈ వాక్యాలు చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని సీఎం జగన్ చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో తనకు కూడా టికెట్ రాకపోవచ్చని, తన సతీమణి సచీదేవికి టికెట్ ఇస్తారేమో అన్నారు. నీకు సీటు లేదు, నీ భార్యకి ఇస్తామని జగన్ అంటే తాను కూడా చేసేది ఏమీ ఉండదని, మహిళలకే ఇస్తామని తేల్చిచెబితే తానైనా పోటీ నుంచి వైదొలగక తప్పదన్నారు బాలినేని.

Read more RELATED
Recommended to you

Latest news