ఈ పీఆర్సీ మాకు వద్దు..జగన్‌ కు షాకిచ్చిన ఉద్యోగులు !

-

పీఆర్సీ ని రద్దు చేయడంపై నల్ల బ్యాడ్జీలతో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ…. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువగా ఉండటాన్ని అప్పుడే మేము వ్యతిరేకించామని… హైదరాబాద్ నుంచి వలస వచ్చిన ఉద్యోగులకు ఉన్న 30 శాతం హెచ్ఆర్ఏ ను తగ్గించి 16 శాతం ఇవ్వటం అన్యాయం అని ఫైర్‌ అయ్యారు.

జీవోలు అన్నింటినీ మేము వ్యతిరేకిస్తున్నామని.. ఈ పీఆర్సీ మాకు వద్దని జగన్‌ సర్కార్‌ కు షాక్‌ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు లాంటి జిల్లా కేంద్రాల్లో వచ్చే 20 శాతం హెచ్ఆర్ఏ ను తగ్గించారని.. పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ ప్రయోజనాలను రద్దు చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. పీఆర్సీ 5 ఏళ్ళకు ఒకసారి ఇవ్వాల్సిందేనని.. ఇది దుర్మార్గమైన చర్య అని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. రేపు కార్యవర్గ సమావేశం, ఎల్లుండి రెండు జేఏసీల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నామని…అశుతోష్ మిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదికను బయట పెట్టాల్సిందేనని పేర్కొన్నారు. అవసరమైతే సమ్మె చేయటానికీ వెనుకాడమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news