హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవిని ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిని సన్మానించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దత్తాత్రేయ ఆహ్వానాన్ని అంగీకరించిన మెగాస్టార్ తప్పకుండా వస్తానని మాటిచ్చారు.
దసరా రోజు విడుదల అయిన మెగాస్టార్ మూవీ గాడ్ ఫాదర్ మంచి హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గొప్ప విలువలు ఉన్న నటుడిగా చిరంజీవికి ప్రత్యేక పేరు ఉందని తెలిపారు.
అలయ్ బలయ్ లాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గవర్నర్ దత్తాత్రేయ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుని కొనియాడారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని చిరంజీవి తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నాయకులు, ప్రముఖులు, ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు అలయ్ బలయ్ కమిటీ ఛైర్మన్ విజయ లక్ష్మి తెలిపారు. అలాగే క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులను ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు.
Met noted film personality and former Union Minister Shri Chiranjeevi ji today at his residence in #Hyderabad along with my daughter Bandaru Vijayalakshmi and invited him for #AlaiBalai cultural festival to be held on October 6 at Exhibition Grounds, #Nampally, Hyderabad. pic.twitter.com/ymDVEqEAo9
— Bandaru Dattatreya (@Dattatreya) October 5, 2022