బరాబర్ కొత్త సచివాలయం డోమ్ లను కూల్చి వేస్తాం – బండి సంజయ్

-

బరాబర్ కొత్త సచివాలయం డోమ్ లను కూల్చి వేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కుమార్‌. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్ కార్వాన్ లో ‘శివాజీ మహారాజ్ సేవాదళ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్‌.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ, హిందువుల దమ్మెందో చూపించే రోజులు వచ్చాయి. శివాజీ మహారాజ్ స్పూర్తితో పోరాడి, తెలంగాణలో రామరాజ్యం స్థాపించే బాధ్యత మనందరిది. శివాజీ ఏనాడూ ఔరంగజేబు వద్ద తలవంచలేదని తెలిపారు.

ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం హిందుత్వాన్ని తాకట్టు పెడతున్న కేసిఆర్ పాలనకు అంతం పలుకుదామని పిలుపునిచ్చారు. శివాజీ స్ఫూర్తిగా రాబోయే 8 నెలలు కష్టపడి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేద్దాం, రామ రాజ్యాన్ని స్థాపిద్దాం. ఓటు అనే ఆయుధంతో, హిందూ సంఘటిత శక్తిని చూపిద్దామని కోరారు బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news