నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడిపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా నిన్న బండి సంజయ్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణమైంది. నిన్న జరిగిన సంఘటనపై బీజేపీ అధి నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా కేంద్రహోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా బండి సంజయ్ కు ఫోన్ చేశారు. నిన్న జరిగిన దాడిపై బండి సంజయ్ ని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై అమిత్ షా , డీజీపీతో మాట్లాడుతా ..అన్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం అండగా ఉంటుందని బండి సంజయ్ కు అమిత్ షా అభయం ఇచ్చారు.
బీజేపీ నేతలు మరికాసేపట్లో రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసైతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. సోమవారం నల్లగొండలో జరిగిన ఘటనపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీకి అధిష్టానం సూచించింది.