బండి సంజయ్ అరెస్టు.. నేడు బంద్ కు పిలుపు

-

తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెంబ‌ర్ 317 ను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు క‌రీంన‌గ‌ర్ ఎంపీ ఆదివారం రాత్రి జాగ‌ర‌ణ దీక్ష‌కు పూనుకున్నాడు. అయితే నిన్న రాత్రి క‌రీంన‌గ‌ర్ పార్లంమెంట్ కార్యాల‌యంలో వ‌ద్ద ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. హైడ్రామాల మ‌ధ్య బండి సంజ‌య్ ను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా కార్యాల‌యం తలుపు ప‌గుల కొట్టి పోలీసులు లోనికి వెళ్లారు. బండి సంజ‌య్ అరెస్టు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌గా కార్య‌క‌ర్తలు అడ్డు వ‌చ్చారు.

దీంతో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్తల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితుల నెల‌కొన్నాయి. చివ‌ర‌గా బండి సంజ‌య్ ను అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్ కు త‌రలించారు. కాగ దీక్షకు అనుమతి లేద‌ని అలాగే దీక్ష శిబిరంలో క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగ బండి సంజ‌య్ అరెస్టుకు నిర‌స‌న గా నేడు క‌రీంన‌గ‌ర్ బంద్ బీజేపీ నాయ‌కులు పిలుపు నిచ్చారు. అలాగే కేసీఆర్ పాల‌న ఎమ‌ర్జీన్సిని త‌లపిస్తుంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హించారు. పార్టీ ఆఫీస్ గేట్లు ప‌గ‌ల కొట్టి ఆరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామికం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news