ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైఎస్‌ఆర్ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. యాసంగి కాలం వచ్చిన నేపథ్యంలో…. వరసగా మూడవ ఏడాది, మూడవ విడతగా రైతు భరోసా సహాయాన్ని చేయనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
రైతు భరోసా పథకం కారణంగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు ప్రయోజనం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో… రైతుల ఖాతాల్లో 1,036 కోట్లు జమ చేయనున్నారు ఆంధ్ర ప్రదేవ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సహాయం 19,813 కోట్లు అందించింది. ఇక ఇవాళ్టి విడతతో… 20 వేల కోట్ల కు దాటనుంది. కాగా.. నవ రత్నాల అమలులో భాగంగానే… వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుంది.