దమ్ముంటే 119 నియోజకవర్గంలో MIM పోటీ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఎంఐఎం నేతలు నిజంగా ఇస్లాం మతం కోసం పనిచేస్తే… కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అమ్ముడుపోకపోతే దమ్ముంటే మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేయాలన్నారు. అట్లాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో పోటీ చేయాలి. డిపాజిట్లు లేకుండా చేసి తీరుతామని హెచ్చరించారు.
ఎంఐఎం నేతలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఎన్నికలకు ముందు పోటీ చేస్తామంటూ బీరాలు పలికి… డబ్బులు దండుకున్నాక పాతబస్తీకే పరిమితమవుతారు. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులంతా కలిసి పోటీ చేసి ఓడగట్టాలని చూస్తున్నాయని వివరించారు. ఎంఐఎం నేతలు బీఆర్ఎస్ నేతలతో కలిసి వక్ఫ్ భూములను కబ్జా చేస్తూ భూదందా చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్ బండి సంజయ్.