వాట్సప్ లో యువతుల ఫొటోలు.. స్పా సెంటర్ కు రప్పించి వ్యభిచారం

-

హైదరాబాద్‌లోని స్పాసెంటర్లు, బ్యూటీ పార్లర్లు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరికతో కొంతమంది ఈ దారుణాలకు తెరతీస్తున్నారు. ఇలా ఈ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటనలు హైదరాబాదులో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కూకట్పల్లిలోని ఓ ఇంట్లో బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో కూకట్పల్లి ఎస్ఓటి పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేశారు. మంగళవారం నాడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు… వెంకట నరసింహారాజు (31) ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తనుకు చెందిన వ్యక్తి.

అతను తెలంగాణలోని హైదరాబాద్, సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో ఉంటున్నాడు. ఇతనికి కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోలావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పాపేరుతో పార్లర్ ఉంది. ఇందులో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలను పంపించి విటులను రప్పిస్తున్నట్లుగా, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంతో కూకట్పల్లి పోలీసులు, ఎస్ఓటి పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి ఆ ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు, మరో నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ అక్కడినుంచి స్టేషన్కు తీసుకువెళ్లారు. దీనిమీద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news