RRR టీమ్‌కు బండి సంజయ్ అభినందనలు

-

ఆస్కార్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ నామినేట్‌ అయిన సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ప్రముఖల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సందర్భంగా ఈ పాట పాడిన టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను బండి సంజయ్ కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు. పూలగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం రాహుల్.. బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు నాటు నాటు పాట పాడారు.

ఇదంతా బండి సంజయ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. “తన టాలెంట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి ఆస్కార్ బరిలో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌ను కలిశాను. ఈ అద్భుత గడియను రాహుల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. మన హైదరాబాద్ కుర్రాడు పాడిన పాట వరల్డ్ ఫేమస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు నా అభినందనలు. ఇంకా మరెన్నో అంతర్జాతీయ అవార్డులు గెలవాలని కోరుకుంటున్నాను” అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news