శ్రద్ధా వాకర్​ను ఆఫ్తాబ్‌ అందుకే చంపాడు.. ఛార్జ్​షీట్​లో కీలక విషయాలు

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో పోలీసులు 6వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆప్తాబ్ ఎందుకు శ్రద్ధాను చంపాలనుకున్నాడో వివరించారు. ఇంతకీ ఈ అభియోగపత్రంలో ఇంకేం వివరాలు ఉన్నాయంటే..

శ్రద్ధా వాకర్‌ హత్య జరిగినరోజు ఆఫ్తాబ్‌ పూనావాలాకు ఇష్టం లేకుండా శ్రద్ధ తన స్నేహితుల్లో ఒకర్ని కలిసేందుకు వెళ్లినట్లు ఛార్జిషీట్‌లో పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఉన్మాదిగా మారిన నిందితుడు ఘాతుకానికి ఒడిగట్టినట్లు దక్షిణ మండలం సంయుక్త పోలీసు కమిషనర్‌ మీను చౌదరీ వెల్లడించారు. ఐపీసీ సెక్షన్‌ 302, 201 ప్రకారం అభియోగపత్రం దాఖలు చేసినట్లు చెప్పారు. 150మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

దిల్లీ పోలీసులు 6వేల 6వందల 29 పేజీల అభియోగపత్రాన్ని సాకేత్‌ కోర్టుకు సమర్పించారు. శ్రద్ధావాకర్‌ హత్యకు నిందితుడు ఐదు రకాల ఆయుధాలను వినియోగించాడని, హత్యచేసిన తర్వాత రంపంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి గురుగ్రామ్‌, దక్షిణ దిల్లీలోని డంపింగ్‌ యార్డు ప్రాంతాల్లో విసిరేశాడని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news