కెసిఆర్ బిడ్డ దొంగ సార దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటుందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతరా? అని మండిపడ్డారు. ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? అన్నారు. తెలంగాణను తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు బండి సంజయ్. ప్రజాధనాన్ని లూటీ చేసి లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా? అని మండిపడ్డారు. దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటోందన్నారు. బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జీలన్నీ పూర్తి చేస్తామన్నారు.
డిగ్రీ కాలేజీ, రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడున్న ఎమ్మెల్యే అవినీతి అనకొండ అని… పాన్ షాపు నుండి పరిశ్రమల దాకా అన్నీ కమీషన్లే నని ఆరోపించారు. టిఆర్ఎస్ నేతలు తాలు పేరుతో రైతులను ఘోరంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్ల కొనుగోలుకు పైసలు అన్ని మోదీ ప్రభుత్వమే ఇస్తుందన్నారు బండి సంజయ్.