మంత్రి కేటీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని.. ఆయన ముఖంలో భయం కనిపిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తనపై చేసిన విమర్శలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కేటీఆర్ స్పందించారని ఎద్దేవా చేశారు బండి సంజయ్. తాను డ్రగ్స్ పై సవాల్ చేసినప్పుడు స్పందించకుండా.. ఇప్పుడా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశాలలో ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. డ్రగ్స్ కేసు దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. వేములవాడకు ఇస్తామన్న 400 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. తన చెల్లి లిక్కర్ కేసుపై మాట్లాడాలని అన్నారు బండి సంజయ్.