తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. ఎప్పుడూ ఫామ్ హౌజ్ లో ఉండే కేసీఆర్ ను బయటకి రప్పించాం అన్నారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ నే ధర్నాకు కూర్చోబెట్టాం అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దీక్షకు.. రైతు చట్టాల రద్దుకు ఏమైనా సంబంధం ఉందా..? అని ప్రశ్నించారు. వానాకాలం పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారని.. ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కోసం నాలుగు రోజులు ఆగుమంటే.. వర్షం నీకోసం ఆగుతుందా..అని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను నీఫామ్ హౌజ్ లో పోయాలా అని ప్రశ్నించారు.
కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తాం అన్నది నిజం కాదా.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. రైతుల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అన్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వస్తే మాపై టీఆర్ఎస్ దాడి చేసిందని ఆరోపించారు. రైస్ మిల్లర్ల కోసం ఆలోచించే కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.