ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకమై దోచుకుందాం, దాచుకుందాం అని అనుకున్నారని చెప్పారు బండి సంజయ్. ప్రజలు తిరస్కరిస్తే జై తెలంగాణ.. లేకుంటే జై ఆంధ్ర అనాలని ఇద్దరు మాట్లాడుకున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను ప్రజలు గుర్తుతెచ్చుకోవాలన్నారు బండి సంజయ్. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు.
లిక్కర్, సాండ్, గ్రానైట్, డ్రగ్స్.. ఇలా అన్ని దందాలు, స్కామ్‌లు వాళ్ళవేనన్నారు. కెసిఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నారని వండిపడ్డారు. కెసిఆర్ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చాడని.. మరోసారి అవకాశం ఇస్తే ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడని అన్నారు. బిజెపి పాదయాత్ర ద్వారానే ఎనిమిది సంవత్సరాలు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ బయటకి వచ్చాడని అన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే.. నిలువ నీడలేని పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు.