ప్రజల కోసం జైల్లోకి వెళ్లడం, లాఠీదెబ్బలు తినడం నాకు మామూలే : ఎంపీ బండి సంజయ్ కుమార్

-

గంగాధర మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్ కి తక్షణమే నీటిని విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజాహిత యాత్రలో భాగంగా ఉప్పరమల్యాలలో మాట్లాడుతూ.. రేపటిలోగా నీటిని విడుదల చేయకపోతే బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు . ప్రజల కోసం జైల్లోకి వెళ్లడం, లాఠీదెబ్బలు తినడం తమకు మామూలు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాస్తామని రాహుల్గాంధీ ప్రకటించడంపై స్పందించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్  కాంగ్రెస్పార్టీలోని పదవుల్లో సగం మహిళలకిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినవే అని,ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలన్నీ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలకే దిక్కులేదన్నారు. వెంటనే మహిళల ఖాతాల్లో రూ. 2,500 వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలకు పైసలు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ అని, కానీ మొన్న ఓట్లు మాత్రం కాంగ్రెసోళ్లకు వేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news