నల్గొండ జిల్లా పర్యటనలో సిఎం కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సీఎం రైతుల పట్ల గజిని గా మారాడని.. ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను తప్పుదారి పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గతంలో ప్రతి గింజ నేనే కొంట అని ఇపుడు మాట మారుస్తుండని.. ఇపుడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంటే చాలు అని ముఖ్యమంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేశారు.
రాత్రిముబావుళ్ళు కల్లాలో వద్ద పడిగాపులు గాస్తున్న.. కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేస్తే రైతులకు తగిలాయన్నారు.. మేము ఇక్కడికి వస్తామని ముందుగానే షెడ్యూల్ ఇచ్చాము..అయిన పోలీసులు విఫలమయ్యారని చురకలు అంటించారు. మీరు కొనుగోళ్లు ఎందుకు ప్రారంభిస్తాలేరు.. గతంలో 1800 ఉన్న మద్దతు ధర ను 1960 కి పెంచింది కేంద్రం అని గుర్తు చేశారు.
రాష్ట్ర ముక్యమంత్రి గజిని వేషాలు మానుకోవాలని.. రైతుల దృష్టిని మళ్లించడానికి, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి మీ నాటకాలు అని ఫైర్ అయ్యారు. అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తరువాత 48 గంటల్లో డబ్బులు ఇస్తున్నారు.మరి నువ్వేం చేస్తున్నావ్ ? అని ప్రశ్నించారు. నీ తాటాకు చప్పుళ్లకు బయపడను..రైతుల కోసం రాళ్ళ దాడికి సిద్ధం, త్యాగాలకు సిద్ధం, రైతుల కోసం బూతులు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నామనీ సవాల్ విసిరారు.