కేసీఆర్ అంకుల్ కి కోపం వచ్చింది : బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుల్ కి కోపం వచ్చిందని… గురువు గారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూతు భాష కోవిదుడు అయ్యారని.. నిజమైన తెలంగాణ ఉద్యమ కారుడు…. శ్రీశ్రీశ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని దిగ జార్చారని మండిపడ్డారు. నోరు తెరిస్తే అబద్దాలు… గంట సేపు అందరు ఎంజాయ్ చేశారన్నారు. నా పీసీ కి కౌంటర్ ఇవ్వాలని సోషల్ మీడియా సమావేశం పెట్టారు అట అంటూ టిఆర్ఎస్ కు చురకలు అంటించారు.

రైతు రుణమాఫీ గురించి చెప్పు అని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.. రైతులు కార్లలో తిరుగుతున్నారట… గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి హైదరాబాద్ నుండి ఊర్లకు వెళ్తున్నారని చురకలు అంటించారు బండి సంజయ్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు, ని బతుకు ఆగమాగం… రైతులను ఆగమాగం చేసింది ఎవరు ? అని మండిపడ్డారు.

62 లక్షల ఎకరాల్లో వరి సాగు వాస్తవమేనా… చూపెట్టు… కేంద్ర మంత్రిని తిడుతావ…? అని నిప్పులు చెరిగారు. ప్రతి గింజ కొంటానని .. కేంద్ర పెత్తనం ఏంటని మాట్లాడితివి ? ధాన్యం కేంద్రం కొట్టుందా రాష్ట్రము కొంటుందా చెప్పు..? అని నిలదీశారు బండి సంజయ్. ఏడేళ్ల నుండి కేంద్రమే కొన్నదని ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పు.. అప్పుడు కేంద్రం గురించి మాట్లాడుదామని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news