ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి.. కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి : బండి సంజయ్

నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్రం మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే కెసిఆర్ ప్రెస్ మీట్ కి.. తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ చెప్పేది అన్ని అబద్ధాలేనని… నిన్న గంటసేపు ప్రెస్ మీట్ లో కెసిఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని చురకలంటించారు బండి సంజయ్.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కేంద్ర ప్రభుత్వం పై మాట్లాడిన సీఎం కేసీఆర్… ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ముక్కు నేలకు రాయాలి అని డిమాండ్ చేశారు. అప్పుడే తాము ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలు పై లెటర్ తీసుకొస్తామని సవాల్ విసిరారు బండి సంజయ్.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి మూడు సంవత్సరాలు అయిపోయిన అప్పటికీ రైతు రుణమాఫీ మాత్రం చేయలేదని మండిపడ్డారు. రేషన్ బియ్యం విషయంలో టీఆర్ఎస్… పెద్ద స్కామ్ నడిపిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు అని మండిపడ్డారు. కేంద్ర జల శక్తి మంత్రిపై అనవసరంగా ఆరోపణలు చేశారని నిప్పులు చెరిగారు బండి సంజయ్.