పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించవో ప్రజలకు చెప్పాలి- బండి సంజయ్

-

పెట్రోల్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రశ్నలు సంధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిన్న కేసీఆర్ పెట్రోల్ ధరలను తగ్గించం అనే వ్యాఖ్యలకు కౌంటర్ గా బండి పలు విమర్శలు చేశారు. పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించవో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని 24 రాష్ట్రాలు పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించ లేదా..అని ప్రశ్నించారు. పెట్రోల్ పై పన్నుల ద్వారా కేంద్రానికి రూ. 27 వస్తే, తెలంగాణకు రూ. 28 ప్రతీ లీటర్ కు వస్తుందని వెల్లడించారు. కేంద్రానికి వచ్చే రూ. 27 రూపాయల్లో కూడా రూ. 12 తెలంగాణకు వస్తుందన్నారు.

కేసీఆర్ అబద్దాలు ఆడటంతో ఎక్స్ పర్ట్ అని అన్నారు. 2015లో పెట్రోల్ పై  4 శాతం, డిజిల్ పై 5 శాతం వ్యాట్ పెంచింది నిజం కాదా.. అని అన్నారు. దేశంలో వ్యాట్ విధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని బండి సంజయ్ అన్నారు. దేశంలో వ్యాట్ పన్నుల్లో రాజస్థాన్ తర్వాత తెలంగాణ ఉందని తెలిపారు బండి సంజయ్

Read more RELATED
Recommended to you

Latest news