ప్రీతి ఆత్మహత్యాయత్నంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

-

కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ప్రీతి ఆత్మహత్యాయత్నంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ర్యాగింగ్ మాత్రమే కాదని, 100% లవ్ జిహాద్ అని ఆరోపించారు. అందుకే ఈ కేసును నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను కాపాడేందుకే అతనిపై సాధారణ కేసులతో జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు.

లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ప్రీతి ఆత్మహత్యాయత్నంపై వరంగల్ సిపి రంగనాథ్ పలు విషయాలను వెల్లడించారు. నాలుగు నెలలుగా ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించినట్లు తెలిపారు. వాట్స్అప్ గ్రూపులో ప్రీతీ ని అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలా మెసేజ్ లు పెట్టవద్దని ప్రీతి వేడుకుందన్నారు. ప్రీతి డేరింగ్ గా ఉండడంతో పాటు చాలా సెన్సిటివ్ అని పేర్కొన్నారు సిపి. సైఫ్ టార్గెట్ చేసిన అంశాలను తండ్రితో పాటు తోటి విద్యార్థులతో కూడా ఆమె పంచుకున్నట్లు సిపి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news