ఏపీలో ఉద్యోగుల పరిస్థితి..కూలీల కంటే దారుణం – బండి శ్రీనివాసరావు

-

ఏపీలో ఉద్యోగుల పరిస్థితి..కూలీల కంటే దారుణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు. ఉద్యోగులు నెలంతా పని చేస్తే 31 తేదీన జీతం ఇవ్వడం ప్రభుత్వ భాధ్యత అని, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలీ కన్నా దారుణంగా ఉందని ఆగ్రహించారు. ప్రభుత్వ ఉద్యోగులు పాలు, కూరగాయల, బ్యాంకుల వాళ్ళ వద్ద కూడా లోకువ అయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని వెల్లడించారు.

ఇక బ్యాంకులు కూడా ఉద్యోగులకు రుణాలు ఇవ్వని పరిస్థితి ఉందని.. నెల జీతం రాకపోతే ఇబ్బందులు అలాంటిది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడితే ఎలా..? అని నిలదీశారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్ లకు జీతాలని నోటిమాటగా చెప్పడమే అమల్లో లేదని ఆగ్రహించారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల అందరికీ 62 రెండేళ్ల ఉద్యోగ విరమణ వయస్సు వర్తింప జేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకూ బదిలీ ప్రక్రియ చేపట్టాలి…జీపిఎఫ్ నిధులు ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవడం ఏమిటి..? అని నిలదీశారు ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news