కరోనా వైరస్ విషయంలో ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బెంగళూరు లో జరిగిన ఒక సంఘటన ఆందోళన కలిగించింది. ఒక కుటుంబానికి బెంగళూరు లో కరోనా సోకింది. దీనితో అక్కడి మున్సిపల్ అధికారులు సదరు అపార్ట్మెంట్ కి సీల్ వీసారు. వాళ్ళు ఎవరూ బయటకు రాకుండా… సీల్ చేసారు. మెటల్ షీట్ తో సీలు వేసారు.
ఎవరు కూడా బయటకు రాకుండా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అపార్ట్‌మెంట్ ఫోటోలను అక్కడ ఉండే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది వైరల్ అయింది. దీనితో వెంటనే గమనించిన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు మెటల్ షీట్ ని తొలగించారు. దీనికి బీబీఎంపీ కమిషనర్ ఎన్ మంజునాథ ప్రసాద్ క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో.