కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ‌హరీష్ రావు..!

-

ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయురారోగ్యాలతో ఉండాలని కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువ మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టొద్దని ప్రతిసారి అభిమానులు, కార్యకర్తలకు సూచిస్తారు కేటీఆర్. ఆ డబ్బులను మంచి పనుల కోసం, ఆపదలో ఉన్న వారి కోసం ఖర్చు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా నిరాడంబరంగానే పుట్టిన రోజును జరుపుకుంటున్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news