ఐపీఎల్ 3వ మ్యాచ్‌.. హైద‌రాబాద్ ల‌క్ష్యం 164..

దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో సోమ‌వారం జ‌రుగుతున్న ఐపీఎల్ 3వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బెంగ‌ళూరు బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు 163 ప‌రుగులు చేసింది.

bangalore made 163 runs against hyderabad in ipl 3rd match

బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ల‌లో దేవ్‌ద‌త్ పాడిక్క‌ల్ (42 బంతుల్లో 56 ప‌రుగులు, 8 ఫోర్లు), ఏబీ డివిలియ‌ర్స్ (30 బంతుల్లో 51 ప‌రుగులు, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు రాణించారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్‌, విజ‌య్ శంక‌ర్‌, అభిషేక్ శ‌ర్మ‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది. ఇక మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు విజ‌యం సాధించాలంటే 164 ప‌రుగులు చేయాల్సి ఉంది.