భారతదేశంలో గత రెండు ఎన్నికలుగా బీజేపీ కూటమి కేంద్రంలో గెలుస్తూ అధికారంలో కొనసాగుతోంది. ఈ రెండు పర్యాయాలుగా బీజేపీ తీసుకువచ్చిన చాలా చట్టాలు మరియు బిల్లుల పట్ల కొన్ని రాష్ట్రాలలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండగా.. దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. ఇక మోదీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు అన్నీ ఒక తాటి పైకి వచ్చి సమిష్టిగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగా గత నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన తొలి విపక్షాల సమావేశం జరిగింది. ఇక రెండవ విపక్షాల సమావేశం కర్ణాటక రాష్ట్రము బెంగుళూరు లో ఈనెల 17 మరియు 18 తేదీలలో జరగనుంది. ఈ సమావేశానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హాజరు కానున్నట్లు స్వయంగా ఆయనే చెప్పారు.
