ఈ సమాజంలో మనుషులుగా పుట్టిన మనకు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సమస్యలతో సహజీవనం చేసే పరిస్థితి మనది. కానీ కొందరు మహిళలు కావొచ్చు లేదా పురుషులు కావొచ్చు సమస్యలకు భయపడిపోయి దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోతున్నారు, అంటే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ లోని హైద్రాబాద్ లో జరిగిన ఒక సంఘటన ప్రతి అమ్మకు కన్నీరు తెప్పిస్తుంది. హైద్రాబాద్ లోని పుప్పాలగూడకు చెందిన శ్రేయారెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఇంకా పెళ్లి కావడం లేదనే ఆలోచనలో ఉందట. ఈ విషయం గురించి బాధ పడుతూ తీవ్ర మనస్థాపానికి గురయ్యి..ఇక ఈ జీవితంలో పెళ్లి అయ్యే రాత లేదని నిర్ధారించుకుని ఇంట్లో సోడియం నైట్రేట్ ఉంటే తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘ్తన స్థలానికి చేరుకొని కేసును నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.