ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి

-

అమరావతి: గృహనిర్మాణాశాఖపై నేడు క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం కి వివరాలు అందించారు అధికారులు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని ముఖ్యమంత్రికి వెల్లడించారు అధికారులు. రూఫ్‌ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపారు అధికారులు.

ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు అధికారులు. కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్నారు సీఎం. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. కోర్టు కేసుల కారణంగా ఇళ్లస్థలాల పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి ∙చర్యలు వేగవంతం చేయాలన్నారు. డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news