Scam Alert : బ్యాంకు కస్టమర్లూ.. మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..! 

-

దుండగులు జనాల డబ్బును దోచేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారు మరో కొత్త మార్గంలో బ్యాంకు కస్టమర్ల డబ్బును దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.

మీ ఫోన్ నంబర్‌కు రూ.1 కోటి లాటరీ తగిలింది.. వెంటనే మీ వివరాలతోపాటు కొంత డబ్బు పంపిస్తే రూ.1కోటి మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం.. అంటూ.. గతంలో కేటుగాళ్లు పెద్ద ఎత్తున జనాల నుంచి డబ్బు దోచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ తరహా నేరాలు తగ్గినా.. దుండగులు జనాల డబ్బును దోచేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారు మరో కొత్త మార్గంలో బ్యాంకు కస్టమర్ల డబ్బును దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

పైన మెసేజ్ చూశారు కదా.. మీ అకౌంట్‌లో డబ్బు క్రెడిట్ అయింది. కావాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి అందులో మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేసి మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండి.. అంటూ అందులో ఉంది. నిజంగానే దీన్ని చూసే చాలా మంది తమకు ఆయాచితంగా డబ్బు వచ్చిందనుకుని ఆశ పడి ఆ లింక్ ఓపెన్ చేస్తున్నారు. అందులో బ్యాంకు వివరాలను ఎంటర్ చేస్తున్నారు. అంతే.. ఆ తరువాత అకౌంట్‌లో డబ్బు పడడం కాదు కదా.. ఉన్న డబ్బునే కోల్పోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం పైన చెప్పిన తరహా నయా సైబర్ మోసాలు బాగా జరుగుతున్నాయి. కనుక బ్యాంకు కస్టమర్లు ఇలాంటి మెసేజ్‌లను ఓపెన్ చేయకపోవడమే మంచిదని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. అలాగే తమ అకౌంట్లలో ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగినా వెంటనే తమకు తెలియజేయాలని.. వినియోగదారులు ఎప్పుడూ తమ బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, వాటి పిన్ నంబర్ల వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులకు వాటిని చెప్పరాదని కూడా బ్యాంకులు సూచిస్తున్నాయి. కనుక.. మీకు కూడా పైన చెప్పిన లాంటి మెసేజ్‌లు వస్తుంటే జాగ్రత్త వహించండి.. ఆ మెసేజ్‌లను అస్సలు ఓపెన్ చేయకండి. వెంటనే డిలీట్ చేసి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయండి. లేదంటే.. ఆ మెసేజ్‌ల పట్ల ఆశ చూపిస్తే అనవసరంగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.. కాబట్టి జాగ్రత్త..!

Read more RELATED
Recommended to you

Latest news