చిరంజీవి – పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే : సుబ్బ‌రామిరెడ్డి

568

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌ళాబంధు సుబ్బ‌రామిరెడ్డి మంత‌నాలు జ‌రుపుతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కులుగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌ట్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చిరు-ప‌వ‌న్ ల‌తో ఒప్పందం చేసుకున్న త‌ర్వాత‌నే ఈ విష‌యాన్ని సుబ్బ‌రామిరెడ్డి మీడియాకు అధికారికంగా వెల్ల‌డించారు. అన్న‌ద‌మ్ములిద్ద‌ర్నీ ఒకే ప్రేమ్ లో చూడాల‌న్న‌ది సుబ్బ‌రామి రెడ్డి డ్రీమ్. అందుకే బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికీ భారీ పారితోషికం ఆఫ‌ర్ చేసి మ‌రీ డీల్ క్లోజ్ చేసారు. చిరు, త్రివిక్ర‌మ్ రెడీ గా ఉన్నా ప‌వ‌న్ రాజ‌కీయాల‌లో బిజీగా ఉండ‌టంతో సినిమా ప్రారంభించ‌డం కుద‌ర‌లేదు.

Pawan Kalyan Chiranjeevi Movie Confirmed

త‌ర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. అయితే తాజాగా సుబ్బ‌రామిరెడ్డి ప‌వ‌న్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ఆయ‌న అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ హైద‌రాబాద్ లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. అందులోనూ ప‌వ‌న్ బ‌స చేస్తుంది కూడా సుబ్బ‌రామిరెడ్డికి చెందిన పార్క్ హ‌య‌త్ హోట‌ల్ లోనే. ఈ నేప‌థ్యంలో వారం రోజుల క్రితం ప‌వ‌న్ ను సుబ్బ‌రామి రెడ్డి క్యాజువ‌ల్ గా క‌లిసారుట‌. ఆ స‌మ‌యంలో సినిమా విష‌యం గుర్తు చేసిన‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ కూడా సానుకూలంగానే స్పందించారుట‌. అయితే క్లారిటీ గా ఎప్పుడు చేద్దాం? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదుట‌. అన్న‌య్య రెడీ గా ఉన్నారు? మీదే ఆల‌స్యం అని సుబ్బ‌రామిరెడ్డి న‌వ్వుతూ అన్నారుట‌.

అందుకు ప‌వ‌న్ కూడా ఓ న‌వ్వు న‌వ్వి లైట్ తీసుకున్నాడుట‌. దీంతో ప‌వ‌న్ గ్రీన్ సిగ్నెల్ ఇస్తే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌డ‌మేన‌ని ఓ క్లారిటీ వ‌చ్చింది. అయితే ఇక్క‌డో స‌మ‌స్య కూడా ఉంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే కొంత మంది నిర్మాత‌ల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారు. వాళ్ల‌లో కొంత మందికి తిరి చెల్లించాడు. కానీ మైత్రీ మూవీ మేక‌ర్స్ మాత్రం తిరిగి ఇచ్చినా తీసుకోలేదు. టైమ్ దొరిక‌న‌ప్పుడే త‌మ బ్యాన‌ర్లో సినిమా చేయండ‌ని కోరింది. ఈ నేప‌థ్యంలో సుబ్బ‌రామిరెడ్డి మాట కాద‌న‌లేక ప‌వ‌న్ సినిమా చేసినా? మైత్రీ నిర్మాత‌ల‌కు కచ్చితంగా సినిమా చేయాల్సి ఉంటుంది. ప‌వ‌న్ ఇప్పుడు పొలిటిక‌ల్ గా బిజీగా లేక‌పోయినా! సినిమాల గురించి ఆలోచించేంత స‌మ‌యమైతే లేదు. మ‌రీ ప‌వ‌న్ నిర్ణ‌యాలు ఎలా ఉంట‌యో కాల‌మే నిర్ణ‌యించాలి.