జులై నెలలో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులో తెలుసా?

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 జులై నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దేశంలోని వివిధ బ్యాంకులకు ఈ నెల ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

2024 జులై నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!

జులై 3 (బుధవారం) : బేహ్ డీఇన్కలమ్ పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.

జులై 6 (శనివారం) : ‘మిజో హ్మీచే ఇన్సుయిహ్ఖామ్ పాల్’ (MHIP) సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.

జులై 7 (ఆదివారం) :

జులై 8 (సోమవారం) : కాంగ్ (రథజాత్ర) సందర్భంగా మణిపుర్లోని బ్యాంకులకు సెలవు.

జులై 9 (మంగళవారం) : బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ‘ద్రుక్పా త్షే-జి’ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.

జులై 13 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలీడే.

జులై 14 (ఆదివారం) :

జులై 16 (మంగళవారం) : హిందూ పండుగ హరేలా సందర్భంగా ఉత్తరాఖండ్లోని బ్యాంకులకు సెలవు.

జులై 17 (బుధవారం) : మొహర్రం/ అషూరా/ యు తిరోట్ సింగ్ డే సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. అయితే గుజరాత్, ఒడిశా, చంఢీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోం, మణిపుర్, ఇటానగర్, కేరళ, నాగాలాండ్, గోవాలో మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి.

జులై 21 (ఆదివారం) :

జులై 27 (శనివారం) : నాలుగో శనివారం కనుక బ్యాంకులు పనిచేయవు.

జులై 28 (ఆదివారం) :

Read more RELATED
Recommended to you

Latest news