హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..ఆ మెసేజ్ వచ్చిందా?

-

హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్..పాన్ కార్డుకు సంభందించిన ముఖ్యమైన సమాచారాన్ని కస్టమర్లకు అందించింది.ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్. కాస్త భారీ స్థాయిలో జరిపే లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి. పాన్ కార్డు ఉంటే పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్న వారికి మంచి బెనిఫిట్ టాక్స్ కట్టవ్వదు..పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయాలంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఎస్ఎంఎస్‌లు ఎక్కువగా వస్తున్నట్టు బ్యాంకు దృష్టికి వచ్చింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.

 

సైబర్ నేరగాళ్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ పేరుతో ఎస్ఎంఎస్ పంపిస్తారు. వెంటనే మీ పాన్ కార్డ్ నెంబర్ అప్‌డేట్ చేయాలని, లేకపోతే ఇ-కేవైసీ ఫెయిల్ అవుతుందని, అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందన్నది ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు… పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఎస్ఎంఎస్‌లో లింక్స్ కూడా ఉంటాయి. ఒకవేళ కస్టమర్లు ఆ లింక్స్ క్లిక్ చేస్తే వారి అకౌంట్ వివరాలు, ఇతర వివరాలు అప్‌డేట్ చేయమని అడుగుతారు. వివరాలు అప్‌డేట్ చేస్తేనే లాక్ అయిన అకౌంట్‌ని అన్‌లాక్ చేయొచ్చని నమ్మిస్తారు. వివరాలన్నీ ఇచ్చేస్తే కస్టమర్ల అకౌంట్ ఖాళీ అవుతూంది.. తెలివిగా వాళ్ళు డబ్బులను గుంజెస్తారు.

ఇలాంటి వాటిని ఎప్పుడూ నమ్మవద్దని బ్యాంక్ అధికారులు అంటున్నారు. అంతేకాదు ఈ విషయం పై బ్యాంక్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది.పాన్ కార్డ్ వివరాలు, అకౌంట్ వివరాలు ఎవరితో షేర్ చేయకూడదని కోరుతోంది. బ్యాంకు సిబ్బంది ఎవరూ మీ అకౌంట్ వివరాలను ఫోన్‌లో లేదా ఎస్ఎంఎస్ ద్వారా అడరగన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎస్ఎంఎస్‌లు అన్నీ 186161 లేదా HDFCBK/HDFCBN ఐడీల నుంచి వస్తాయి. ఇతర ఐడీల నుంచి వచ్చే ఎస్ఎంఎస్‌లను పట్టించుకోకూడదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పంపే లింక్స్ కూడా hdfcbk.io అఫీషియల్ డొమైన్‌తో ఉంటాయి..ఇంకేదైనా పూర్తీ వివరాలను అప్డేట్ చెయ్యాలని అనుకుంటే మాత్రం మీ బ్రాంచ్ కు వెళ్ళి అప్డేట్ చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Latest news