ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..దేశ వ్యాప్థంగా ఉన్న కొందరి అకౌంట్స్ బ్లాక్ అవ్వనున్నాయి. కస్టమర్లు నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ నిబంధనల్ని పాటించని కారణంగా ఎస్‌బీఐ వారి అకౌంట్లను నిలిపివేస్తోంది. దీంతో సదరు కస్టమర్లు ట్విట్టర్ ద్వారా ఎస్‌బీఐని సంప్రదిస్తున్నారు. తమ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారని ఆరా తీస్తున్నారు. జూలై 1 నాటికి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయని కారణంగా ఎస్‌బీఐ ఆ కస్టమర్ల అకౌంట్లను బ్లాక్ చేస్తోంది.
ప్రస్తుతం బ్యాంకు కేవైసీ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా కేవైసీ అప్‌డేట్ లేని అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. దీంతో విదేశాల్లో ఉంటున్న ఎస్‌బీఐ కస్టమర్లు తమ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించ లేకపోతున్నారు. మీ అకౌంట్ కేవైసీ వివరాలు అప్‌డేట్ కాలేనట్టుంది. అందుకే మీకు సమాచారం అందిస్తున్నాం. దయచేసి బ్రాంచ్‌ను సందర్శించి, మీ అకౌంట్ సజావుగా పనిచేసేందుకు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయండి అని కస్టమర్లకు ఎస్బీఐ చెబుతోంది..
కేవైసీ అప్‌డేట్ విషయంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తన అకౌంట్ సేవల్ని నిలిపివేశారని మరో కస్టమర్ ఫిర్యాదు చేశారు. కేవైసీ వివరాలు లేవని అకౌంట్ నిలిపివేశారని, కేవైసీ అప్‌డేట్ చేయాలని తనను ఎవరూ కోరలేదని అన్నారు. ఇలా అనేక మంది ఎస్‌బీఐ కస్టమర్ల అకౌంట్లు బ్లాక్ అవుతుండటంతో లావాదేవీలు జరపడంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..
ఇకపోతే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు తరచూ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని కస్టమర్లకు ఎస్ఎంఎస్‌తో పాటు ఇతర మాధ్యమాల్లో బ్యాంకు సమాచారం ఇవ్వాలి. కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. కేవైసీ వివరాలు ఎలాంటి మార్పులు లేకపోతే కేవైసీ డాక్యుమెంట్స్‌ని కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ నుంచి బ్రాంచ్ ఇమెయిల్ ఐడీకి సమాచారం అందించవచ్చు..
ఎస్‌బీఐ కస్టమర్ అయితే మీ ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందేమో చెక్ చేయండి…ఒకవేళ వచ్చింది అంటే మాత్రం వెంటనే సమీప బ్రాంచ్ కు వెళ్ళి కేవైసీని అప్డేట్ చెయ్యాలి.అయితే, కేవైసీలో ఎలాంటి మార్పులు లేకపోతే ఓ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేస్తే చాలు. బ్రాంచ్‌కు వెళ్లి ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపొచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో కేవైసీ ఫామ్ ఉంటుంది. ఒకవేళ కేవైసీ వివరాల్లో మార్పులు ఉంటే ఒరిజినల్ కేవైసీ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.. మీ అకౌంట్ కు కేవైసీ చేసి ఉందో లేదో అనేది సమీప బ్రాంచ్‌కి వెళ్ళి తెలుసుకోండి..