ఈ మూడు బ్యాంకుల కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాదిలోనే క్రెడిట్ కార్డు యూపీఐ సేవలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు బ్యాంక్స్ ఈ సేవలను కస్టమర్లకు ఇస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు క్రెడిట్ కార్డు యూపీఐ సేవలు ని కస్టమర్స్ కి అందిస్తున్నాయి. రూపే క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు యూపీఐ యాప్స్‌ లో లింక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా యూపీఐ యాప్ నుంచే క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సక్షన్స్ చేసేయచ్చు.

banks
banks

ఎస్‌బీఐ , ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఇంకా తన ఈ సేవలను తీసుకురాలేదు. అయితే ఈ బ్యాంకులు ఇప్పుడు యూజర్లకు ఈ క్రెడిట్ కార్డు యూపీఐ సేవలు ని తీసుకురావొచ్చని తెలుస్తోంది. జూన్ కి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి ఈ యూపీఐ సేవలు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

రూపే క్రెడిట్ కార్డు ఉంటేనే వుంటుంది. మార్చి నెల చివరి కల్లా క్రెడిట్ కార్డు యూపీఐ సేవలు రావచ్చు. క్రెడిట్ కార్డు యూపీఐ సేవల వలన క్రెడిట్ కార్డు వాడే వారికి మర్చంట్లకు కూడా రిలీఫ్ ఉంటుంది. వేగంగా ట్రాన్సాక్షన్లు చేసేయచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా కూడా కార్డు ద్వారా పేమెంట్ పొందొచ్చు. యూపీఐ యాప్ ద్వారా కేవలం మర్చంట్లకు మాత్రమే పేమెంట్ చేసేందుకు అవుతుంది. కానీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అవ్వదు.

Read more RELATED
Recommended to you

Latest news