ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిబ్రవరి 25, 2022 నుంచే ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకు ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్లు 2.80 శాతం నుంచి 5.25 శాతానికి మధ్యలో వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బరోడా బ్యాంక్ పెంచింది. 2.80 శాతం నుంచి 5.25 శాతానికి మధ్యలో ఇవి వున్నాయి. ఈ ఎఫ్‌డీల కాల పరిమితి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంది. పైగా ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు స్పెషల్ వడ్డీ రేటును కూడా బ్యాంక్ ఇస్తోంది. ఇక వడ్డీ రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల వరకు మెచ్యూరిటీ అయ్యే ఎఫ్‌డీలపై 2.80 శాతం వడ్డీ రేటును ఇస్తోంది బ్యాంక్.

46 రోజుల నుంచి 180 రోజులకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు 3.7 శాతం వడ్డీని ఇస్తోంది. అలానే 181 రోజుల నుంచి 270 రోజుల వరకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు 4.30 శాతం వడ్డీ రేటును ఇవ్వగా..271 రోజుల నుంచి ఏడాది వ్యవధిలోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 4.4 శాతం ఇస్తోంది. అలానే ఏడాదిలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు వడ్డీ రేటు 5 శాతంగా ఉంది.

సంవత్సరం నుండి మూడు ఏళ్ళకి అయితే 5.1 శాతం. అదే మూడేళ్ల పైనుంచి ఐదేళ్ల వరకున్న డిపాజిట్లకు 5.25 శాతం. ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు మెచ్యూర్ ఎఫ్‌డీలకు కూడా 5.25 శాతం వడ్డీ రేటును బ్యాంకు ఆఫ్ బరోడా ఇస్తోంది.