సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో అనేది లైసెన్స్ వ్యభిచారం లాంటిదని.. ఇది అనైతికం…అక్కడ యువతీ, యువకుల్ని పెట్టి బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారని నిన్న మండిపడ్డారు. నేను ఫిర్యాదు చేసిన తర్వాత.. లైవ్ కెమెరాలు పెడుతున్నారని.. కెమెరాలు కంటపడకుండా ఏమైనా చేయచ్చు కదా అని నిలదీశారు.
అయితే సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి… సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్ లో తమన్నా మాట్లాడుతూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సిపిఐ నారాయణ ను చెప్పులతో కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టీవీ డిబేట్ లోని ఇతర నిపుణులు తమన్నా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు… తెచ్చి పెట్టిందని… బయట ఊహిస్తున్నది నిజం కాదని పేర్కొన్నారు. పైగా షో నచ్చని వాళ్లు చానల్ మార్చుకోవాలంటే సలహా ఇచ్చింది తమన్నా.