మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణాలు..!

-

మన దేశంలో ఎన్నో బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నారు.. అంతేకాదు కొన్ని బ్యాంకులు కూడా లోన్స్ ఇస్తూ వారి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయి.. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.. ఆ బ్యాంకులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కెనరా బ్యాంక్ ఇతర రుణగ్రహీతలకు 9.25% వడ్డీతో రుణం ఇస్తే మహిళా రుణగ్రహీతలకు 8.85% వడ్డీతో గృహ రుణాలను అందిస్తోంది.. ఎస్‌బీఐ నుండి గృహ రుణాలను ఎంచుకునే మహిళలు వారి వడ్డీ రేట్లపై 5 బేసిస్ పాయింట్ల రాయితీ పొందవచ్చు. అదే విధంగా హెచ్‌డిఎఫ్‌సి మహిళలకు గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును కూడా అందిస్తుంది. వడ్డీ రుణ మొత్తం మరియు క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.. క్రెడిట్ స్కోర్ బాగున్నా వారికి ఇంకా తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తుంది..

ఎన్‌బీఎఫ్‌సీలు అందించే వడ్డీ రేట్లు రుణ కాల వ్యవధి, ఆదాయ స్థాయి, క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా మారవచ్చు. కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఒంటరి మహిళా రుణగ్రహీతలు లేదా వ్యాపారవేత్తల కోసం వ్యాపార రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రత్యేక పథకాలను కూడా అందిస్తాయి. రుణగ్రహీతలు రుణంపై నిర్ణయం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే నిబంధనలను వివరంగా పరిశీలించాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు ట్యాక్స్ కూడా ఉపశమనం కలిగిస్తుంది.. మహిళలు తమ ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు అనేక ప్రత్యేక పథకాలు ఉన్నాయి. కానీ, ఏదైనా రుణం తీసుకునే ముందు, లోన్ తీసుకొనేవారు తప్పనిసరిగా కొన్నిసార్లు నియమాలను తెలుసుకొని తీసుకోవడం మేలు..

Read more RELATED
Recommended to you

Latest news