ఇలా యోనో లైట్ యాప్‌లో ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని పొందండి..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఇవ్వడానికి యోనో ఎస్‌బీఐ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనేక సేవల్ని యోనో ఎస్‌బీఐ దీని నుండి ఇస్తోంది. అయితే దీని ద్వారా ఎలాంటి సేవలని పొందొచ్చు అనేది చూద్దాం.

SBI
SBI

ఎస్‌బీఐలో రుణాలు తీసుకున్నవారు తమ లోన్ అకౌంట్స్‌కు సంబంధించిన వివరాలు ఈజీగా చూసుకొచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినవారు డిపాజిట్ అకౌంట్ మినీ స్టేట్‌మెంట్ పొందొచ్చు.
అలానే సుకన్య సమృద్ధి యోజన లేదా పీపీఎఫ్ అకౌంట్స్ ఉన్నవారు కూడా ఆ స్కీమ్స్ వివరాలు పొందొచ్చు
యోనో ఎస్‌బీఐ యాప్‌లో మై అకౌంట్స్ సెక్షన్ ఉంటుంది. అందులో సేవింగ్స్, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
మొబైల్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు. సొంత అకౌంట్లకు, థర్డ్ పార్టీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ఉపయోగించొచ్చు. అదే విధంగా నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా అవుతుంది.
యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేస్తే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ఎస్‌బీఐ లైఫ్ సేవల్ని కూడా యోనో ఎస్‌బీఐ యాప్‌లో పొందొచ్చు.
అదే విధంగా కార్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లాంటి రుణాలకు కూడా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అలానే మొబైల్ రీఛార్జ్ చేయడం కూడా యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా చెయ్యచ్చు. రిసీవర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బులు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయడానికి క్విక్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ఉపయోగప డుతుంది. ఇలా అనేక సేవలు ఈ యాప్ ద్వారా మనం పొందొచ్చు.