ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్… కొత్త రూల్స్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తుంది. దీనితో కస్టమర్స్ కి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు మోసగాళ్ల నుంచి సేఫ్టీ కల్పించేందుకు కొన్ని రూల్స్ ని మార్చేసింది. అయితే ఈ మేరకు సురక్షితమైన ఆర్థిక లావాదేవీల కోసం నిర్ణయం తీసుకుంది.

దీని వల్ల బ్యాంక్ ఖాతాదారులు సురక్షితంగా లావాదేవీలు చెయ్యచ్చు. కేవలం కొంత మందికి మాత్రం ఇబ్బంది కలిగే అవకాశముంది. అయితే స్టేట్ బ్యాంక్ రూల్స్ ని మార్చడం వలన ఎస్‌బీఐ యోనో కస్టమర్లపై ప్రభావం పడొచ్చు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేని వారు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

రిజిస్టర్ మొబైల్ నెంబర్ కలిగిన వారు మాత్రమే ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వడానికి అవుతుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ లేకపోతే లాగిన్ అవ్వలేరు. ఈ విషయాన్ని బ్యాంక్ కస్టమర్స్ గుర్తు పెట్టుకోవాలి. ఆన్ లైన్ మోసాల నుండి రక్షణ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ ని చేసింది. ఆన్‌లైన్ మోసాలు ఆపాలని.

బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలంటే బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో కలిగి ఉండాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటేనే యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వగలరు. లేదంటే లేదు. అయితే గతంలో ఇలా కాదు.

ఏ ఫోన్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోతే బ్యాంక్‌కు వెళ్లి ఫోన్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి. ఏటీఎం నుంచి రూ.10 వేలు లేదా ఆపైన డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటే కచ్చితంగా ఓటీపీ వస్తుంది. అందువల్ల మీరు ఏటీఎంకు వెళ్లేటప్పుడు ఫోన్ కూడా తీసికెళ్ళాలి. లేదంటే రూ.9900 వరకే ఏటీఎం నుంచి తీసుకోవడానికి అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news