టాలీవుడ్ నటి హంసా నందినికి క్యాన్స‌ర్‌.. ప‌రిస్థితి విష‌యం !

క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను క‌లిచి వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా… ఈ మ‌హ‌మ్మారి… సీని న‌టుల‌ను ఎంద‌రినో… పొట్ట‌పెట్టుకుంది. ఇక తాజాగా టాలీవుడ్ న‌టి.. హంసా నందిని క్యాన్స‌ర్ బారీన ప‌డింది. నటి హంసా నందిని నాలుగు నెలల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశకు గురైంది.

ఆమె తల్లి కూడా క్యాన్సర్‌తో మరణించింది. హంసా నందినికి తాజాగా BRCA1 పాజిటివ్ అని తేలింది. (అంటే ఆమెకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుంది). క్యాన్స‌ర్ తో తల్లిని కోల్పోయిన ఆమెకు కూడా క్యాన్సర్ ఉండ‌టం… చాలా విషాద‌క‌రం. ప్ర‌స్తుతం హంస నందిని బ్రెస్ట్ క్యాన్స‌ర్ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. ఈ నేప‌థ్యంలోనే.. ఆమె గుండు తీయించుకున్న ఫోటో వైర‌ల్ అయింది. కాగా.. హంసా నందిని తెలుగులో చాలా మూవీస్ లో న‌టించారు. మిర్చి, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, లెజెండ్‌, భాయి, అత్తారింటికి దారేది సినిమాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం పుణెలో నివాసం ఉంటుంది న‌టి హంసా.