ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…బోయపాటి కాంబోలో సినిమా…?

-

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అఖండ మూవీ సూపర్ హిట్ కావడంతో బోయపాటి నెక్ట్ మూవీపై అందిరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే వీరద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ఫిలిం సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి.

వినయ విధేయ రామ డిజాస్టర్ తరువాత.. బాలయ్య తో చేసిన అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. మాస్ ప్రేక్షకులకు సినిమా పిచ్చపిచ్చగా నచ్చింది. బోయపాటి.. బాలయ్య బాబును చూపించిన విధానం ముఖ్యంగా ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. మరోవైపు సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

దీంతో వీరిద్దరి బోయపాటి, బన్నీ కాంబినేషన్ లో సినిమా పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే సమ్మర్ లో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. 2022 సమ్మర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియాలో లెవల్లో తీస్తున్నట్లు సమాచారం. బోయపాటి బన్నీ కోసం యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది. దీన్ని అల్లు అర్జున్ నిర్మిస్తారని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సూపర్ డూపర్ హిట్ సాధించింది. మరోసారి వీరిద్దరి కలయితో వచ్చే సినిమాపై అభిమానుల అంచనాలు విపరీతంగా ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news