స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తుంది. దీని వలన కస్టమర్స్ కి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న ఎస్‌బీఐ కొన్ని రూల్స్‌ను మార్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూల్స్ ని వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి అమలులోకి తీసుకు రానుంది. ఈ రూల్స్ వలన బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారిపై ప్రభావం పడచ్చు. కనుక వాటిని తెలుసుకోవాలి. మరి ఏయే అంశాలు మారుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్‌బీఐ ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ రూల్స్‌ను మార్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) నిబంధలలో కూడా మార్పులు తీసుకు వచ్చింది.
ఈ లిమిట్ ని స్టేట్ బ్యాంక్ మార్చింది. అయితే ఇలా మార్పు తీసుకు రావడం తో ఐఎంపీఎస్ ద్వారా ఒకేసారి రూ.5 లక్షల వరకు లావాదేవీలు నిర్వహించడానికి అవుతుంది. ప్రస్తుతం ఈ లిమిట్ రూ.2 లక్షల వరకే వుంది. అదే విధంగా స్టేట్ బ్యాంక్ మరొక విషయమేమిటంటే ఐఎంపీఎస్ ద్వారా రూ.5 లక్షల వరకు లావాదేవీలు నిర్వహిస్తే ఎలాంటి చార్జీలు చెల్లించక్కర్లేదు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా మీరు నిర్వహించే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా కాకుండా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఇక ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ టూవీలర్ లోన్ తీసుకునే వారికి ఎస్‌బీఐ తక్కువ ఈఎంఐ ప్రయోజనం కల్పించనుంది.