టాప్‌ 5 మ్యూచవల్‌ ఫండ్స్‌ ఇవే.. ఇందులో ఇన్వస్ట్‌ చేస్తే డబ్బే డబ్బు

-

డబ్బును పొదుపు చేయకపోతే ఎంత వచ్చినా నెలాఖరికి జేబు ఖాళీ అవుతుంది. చాలా మంది డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి, మంచి రిటర్న్స్‌ ఉండేలా చూసుకోవాలి అనుకుంటారు. కానీ ఎక్కడ పెట్టాలో తెలియకపోవడమే ఇక్కడ సమస్య. డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ దాకా చాలా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు అధిక రాబడి అందించే టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో అదిరే రాబడి పొందొచ్చని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే వీటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకుంటే ప్రొపెషనల్ ఫండ్ మేనేజర్లు ఉంటారు. వీళ్లు మీ డబ్బును అధిక రాబడి అందించే స్టాక్స్‌లో పెడతారు. అయితే ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది. అందుకే డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమైన మార్గం.

మూడేళ్ల రాబడి ఆధారంగా చూస్తే.. టాప్ 5 ఈఎల్ఎల్ఎస్ఎస్ పండ్స్ ఇవే..

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ కూడా అదిరే రాబడి అందించింది. ఈ ఫండ్ మూడేళ్ల కాలంలో 13.19 శాతం రాబడిని ఇచ్చింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా మంచి రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ రిటర్న్ 26.6 శాతంగా ఉంది.

యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా సూపర్ ప్రాఫిట్ ఇచ్చింది. ఈ ఫండ్ రిటర్న్ 16.85 శాతంగా ఉంది.

బరోడా బీఎన్‌పీ పారిబాస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కూడా సూపర్ డూపర్ రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ రిటర్న్ 19.5 శాతంగా ఉంది.

బంధన్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా అదిరే రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ ఏకంగా 32.14 శాతం రిటర్న్ అందించింది.

ఈ పండ్స్ రిస్క్ మీటర్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల డబ్బులు పెట్టాలని భావించే వారు అధిక రిస్క్ ఉంటుందని గమనించుకోవాలి. అందుకే డబ్బులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ ఆర్టికల్‌ను కేవలం సమాచారం కోసం అందించాం అని గమనించగలరు. దీని ఆధారంగా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news