ఫిక్స్‌ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? ఈ బ్యాంకుల్లోనే ఎక్కువ వడ్డీ…!

-

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. ఆర్బీఐ రెపోరేటు, రివర్స్ రెపోరేటు సవరించడంతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్నాయి.

banks
banks

అలానే ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కూడా ఇస్తున్నాయి. కస్టమర్లు చేసే ఎఫ్‌డీ లపై 3 శాతం నుంచి దాదాపు 8.25 శాతం వరకు వడ్డీ రేటును బ్యాంకులు ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అయిన ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కస్టమర్లకు ఎఫ్‌డీలపై భారీ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇక మరి మనం వాటి వివరాలని కూడా చూసేద్దాం.

ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఎక్కువ వడ్డీ ని ఇస్తోంది. గరిష్ట వడ్డీ రేటును ఈ బ్యాంకు ఇస్తోంది.
ఎక్కువ కాలం ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ వస్తోంది. అదే సాధారణ కస్టమర్లకు అయితే 7.75 వడ్డీ ఇస్తోంది.
ప్రైవేట్‌రంగ బ్యాంకు అయిన ఇండస్‌ఇండ్ బ్యాంకు అయితే సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.50 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేటును ఇస్తోంది.
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల 3 నెలల వరకు ఉంటుంది.
యెస్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను 3.25 శాతం-7.5 శాతం ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8.00 శాతం వరకు ఇస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news